ఆంధ్రప్రదేశ్లో బుధవారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు బంద్ చేయనున్నారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో బుధవారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు బంద్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బంక్ యజమానులు, ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ సంయుక్తంగా బంద్ ప్రకటించాయి. దీంతో ఏపీలో 2,800 పెట్రోల్ బంక్ లు మూతపడనున్నాయి. ఈ కారణంగా ఇప్పటికే బంక్ ల వద్ద భారీగా వాహనదారులు క్యూ కట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంక్ లు బంద్ ప్రకటించగా.. విశాఖ పెట్రోల్ బంక్ లు బంద్ లో పాల్గొనడం లేదని సమాచారం. ఈ విషయాన్ని విశాఖ పెట్రోల్ డీలక్స్ అసోసియేషన్ సెక్రటరీ నారాయణరెడ్డి తెలిపారు.