గురజాడ ఫౌండేషన్‌ కవితల పోటీ | poetic,recitals, gurajada | Sakshi
Sakshi News home page

గురజాడ ఫౌండేషన్‌ కవితల పోటీ

Published Wed, Aug 10 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

poetic,recitals, gurajada

ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ): మహాకవి గురజాడ వేంకట అప్పారావు 153వ జయంత్యుత్సవాల సందర్భంగా కవితల పోటీలు నిర్వహించనున్నామని గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) ఇండియా శాఖ అధ్యక్షుడు, గురజాడ మనుమడు జీవీ రవీం ద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు తమ రచనలను ‘గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా రిజిస్ట్రేషన్‌) ఇండియా శాఖ, విశాఖపట్నం, కేరాఫ్‌ రామకష్ణా పాఠశాల, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, విశాఖపట్నం’ చిరునామాకు పంపాలన్నారు. కవితతోపాటు ఈ కవిత తన స్వంతమని, దేనికి అనువాదం, అనుకరణ కాదని స్వదస్తూరితో హామీపత్రం జత చేసి పంపాలని కోరా రు. ఈనెల 22లోగా కవితలు పంపాలన్నారు. విజేతల వివరాలు సెప్టెంబరు 11న జరుగబోయే జయంత్యుత్సవాల్లో ప్రకటిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 98668 67610, 98492 74738 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement