డెంగీతో విద్యార్థిని మృతి | politecinc student dead with dengy | Sakshi
Sakshi News home page

డెంగీతో విద్యార్థిని మృతి

Published Sat, Aug 20 2016 8:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

politecinc student dead with dengy

సిరిసిల్ల : సిరిసిల్లలో పాలిటెక్నిక్‌ విద్యార్థిని శుక్రవారం రాత్రి డెంగీతో మృతిచెందింది. పట్టణంలోని శివనగర్‌కు చెందిన కాటబత్తిని వైష్ణవి(18) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నా తగ్గలేదు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే వైష్ణవి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డెంగీంతోనే వైష్ణవి మరణించి ఉంటుందని భావిస్తున్నారు. యువతి మృతికి సంతాపకంగా స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులు సంతాపం ప్రకటించి బంద్‌ చేశారు. వైష్ణవి తల్లి అరుణ బీడీ కార్మికురాలు, తండ్రి గణేశ్‌ మరమగ్గాల కార్మికుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement