పవర్‌మ్యాన్‌ | power man | Sakshi
Sakshi News home page

పవర్‌మ్యాన్‌

Published Mon, Aug 8 2016 12:33 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

పవర్‌మ్యాన్‌ - Sakshi

పవర్‌మ్యాన్‌

జూడోలో సత్తాచాటుతున్న వరంగల్‌æవాసులు పతకాలు, అవార్డులతో ప్రత్యేక గుర్తింపు జపాన్‌ క్రీడలో రాణిస్తున్న నాగరాజు, రాము జూడో ఆటకు గుండె ధైర్యంతో పాటు కండ ౖ«§ð ర్యం కూడా ఉండాలి.. పోటీల్లో ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కోవాలంటే ఆ రెండింటితోపాటు తెలివితేటలు కూడా ఉండాలి.. మరీ ఇలాంటì సాహసోపేతమైన క్రీడలో తమదైన ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిల్లో జిల్లా పేరును నిలబెడుతూ ముందుకుసాగుతున్నారు నాగరాజు, రాము. ఆడే ఆటపై శ్రద్ధ కనబరిస్తే పతకాలు ఇంటి గుమ్మం తట్టుతాయని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌ జాతీయ క్రీడగా వెలుగొందుతున్న జూడోలో రాణిస్తున్న ఇద్దరు క్రీడాకారుల ట్రాక్‌ రికార్డుపై ప్రత్యేక కథనం. –వరంగల్‌ స్పోర్ట్స్‌ జూడో అనగానే మార్షల్‌ ఆర్ట్స్‌ అని చాలా మంది టక్కున చెబుతారు. కరాటే, కుంగ్‌ఫూను పోలిన ఈ ఆట మన దేశంలో అంతగా ప్రాచుర్యం పొందలేకపోయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది. జిగారోఖానో అనే మార్షల్‌ ఆర్ట్‌ చేతుల మీదుగా జపాన్‌లో 1882లో ఈసాహస క్రీడ పుట్టింది. అయితే ఆత్మరక్షణకు దోహదపడే జూడో ఆటను 1929లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పశ్చిమబెంగాల్‌లోని తన శాంతినికేతన్‌ ఆశ్రమంలో విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ మేరకు ఇద్దరు విద్యార్థులను జపాన్‌కు పంపించి అక్కడ జూడో శిక్షణ ఇప్పించి తీసుకొచ్చారు. 1965లో జెడ్‌ఎఫ్‌ఐ ఏర్పాటు జూడో పేరు వినగానే భారతదేశంలో అవతార్‌సింగ్, సుశీల, నవజ్యోతిచన్నా, గరియా చౌదరి గుర్తుకొస్తారు. 1965లో జూడో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎఫ్‌ఐ) ఏర్పడిన తర్వాత ఈ క్రీడకు భారత్‌లో ప్రోత్సాహం అందుతూ వస్తుంది. పంజాబ్‌లోని పాటియాలలో ఎన్‌ఐఎస్‌లో జూడోకు ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో ప్రత్యేక తర్ఫీదు పొందిన కోచ్‌లు జూడోలో క్రీడాకారులకు శిక్షణ ఇస్తుంటారు. ఎ¯Œæఐఎస్‌లో ఏడాది పాటు శిక్షణ పొందితే కోచ్‌గా సర్టిఫికెట్‌ అందజేస్తారు. జూడోలో దక్షిణభారత్‌తో పోలిస్తే ఉత్తర భారత్‌లోనే ఎక్కువ ఆదరణ, ప్రోత్సాహం ఉందని చెప్పవచ్చు. 1964లో ఒలింపిక్స్‌లో స్థానం టోక్యో నగరంలో 1964లో జరిగిన ఒలింపిక్స్‌లో జూడోకు స్థానం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ఉన్న ఫుట్‌బా ల్‌ తర్వాత రెండో స్థానం జూడోది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా, ప్రపంచంలోని 184 దేశాల్లో జూడో క్రీడాకారులు ఉన్నారు. వరంగల్‌ జిల్లాలో ఈ క్రీడను నేర్చుకునేందుకు చాలామంది యువకులు ఉత్సాహం చూపుతున్నారు. నాగరాజు.. పతకాల రారాజు హన్మకొండలోని వడ్డేపల్లికి చెందిన నాయకపు నాగరాజు ఎంటెక్‌ పూర్తి చేశారు. ఆయన తండ్రి లక్షీ్మనారాయణ ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నాగరాజుకు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో పాఠశాల స్థాయిలోనే జూ డోలో శిక్షణ పొందారు. నాగరాజు ఇప్పటివరకు 25 వరకు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. అలాగే గతేడా ది పంజాబ్‌ పాటియాలలోని ఎన్‌ఐఎస్‌లో జూడోలో కోచ్‌గా శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలంపిక్స్‌ అసోసియే రాణిస్తున్న ‘రాము’ వరంగల్‌లోని దేశాయిపేటకు చెందిన చందనగిరి రాము సీకేఎం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేదు. ఈ క్రమంలో పాఠశాల, కళాశాల స్థాయిల్లో తాను నేర్చుకున్న జూడోలోఎన్‌ఐఎస్‌ చేసేందుకు ఆయన ఎదురుచూస్తున్నారు. అయితే అప్పటికీ తండ్రి చనిపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ అసోసి యేషన్‌ జిల్లా కార్యదర్శి కైలాస్‌యాదవ్‌ ప్రోత్సాహంతో రాము ఎ¯Œæఐఎస్‌ పూర్తి చేశారు. ఇప్పటివరకు ఆయన 20 రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలను సాధించారు. నాగరాజు ట్రాక్‌ రికార్డ్‌ l 2006 నుంచి 2008 వరకు ఢిల్లీ, గుజరాత్‌లో జరిగిన 50, 51, 53వ జూనియర్‌ నేషనల్‌ పోటీలకు హాజరు l 2007 నుంచి 2009 వరకు ఆగ్రా, మణిపూర్, చత్తీస్‌గఢ్‌లో జరిగిన జూనియర్‌ నేషనల్‌ పోటీలకు హాజరు. l 2012–13లో జాతీయ బ్లాక్‌బెల్ట్‌కు అర్హత. l 2013–14లో హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌కు హాజరు l 2012–13లో హైదరాబాద్‌లో జరిగిన సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌. l 2007, 2008, 2011లో వరంగల్, కర్నూల్, నల్లగొండలో జరిగిన జూనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ పోటీల్లో బంగారు పతకాలు. l 2014–15లో సౌత్‌జోన్‌ జూడో చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్‌. రాము ట్రాక్‌ రికార్డ్‌ l 2008లో కర్ణాటకలో జరిగిన సాయి సౌత్‌జోన్‌ చాంపియన్‌షిప్‌లో సిల్వర్‌ మెడల్‌. l 2009లో హైదరాబాద్‌లో జరిగిన సాయి సౌత్‌జోన్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌. l 2013లో వరంగల్‌లో జరిగిన జూడో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో (బ్లాక్‌బెల్ట్‌) ఫస్ట్‌డాన్‌. l 2015లో వరంగల్‌లో జరిగిన జూడో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో (బ్లాక్‌బెల్ట్‌) సెకండ్‌ డాన్‌. l 2015లో హైదరాబాద్‌లో జరిగిన సౌత్‌ జోన్‌ సీనియర్‌ నేషనల్‌లో గోల్డ్‌మెడల్‌. l 2015లో షిల్లాంగ్‌లో జరిగిన జూనియర్‌ జూడో చాంపియ¯Œæషిప్‌నకు జాతీయజట్టుకు కోచ్‌గా బాధ్యతలు.షన్‌ జిల్లా కార్యదర్శి కైలాస్‌యాదవ్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రోత్సాహం తో తాను జూడోలొ జాతీయస్థాయిలో రాణిస్తున్నానని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement