జీఎస్‌టీకి వ్యతిరేకంగా నిరసన
Published Tue, Oct 4 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
కర్నూలు(రాజ్‌విహార్): కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న జీఎస్‌టీ పన్ను విధానంపై పునరాలోచించాలని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జె. తాతారావు అన్నారు. సోమవారం మధ్యాహ్న భోజన విరామంలో ఒకే జీఎస్‌టీ విధానానికి వ్యతిరేకంగా నగర శివారులోని ఇండస్ వద్ద ఉన్న ఆశాఖ కార్యాలయం ఎనదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే జీఎస్‌టీ పన్నుల విధానాన్ని అమల్లోకి తీసుకొస్తే రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతుందన్నారు. జీఎస్‌టీ టర్నోవర్ పరిధిని రూ.1.50కోట్ల నుంచి రూ.10కోట్లకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు శ్రీవెంకటేశ్వర్, గీతా మాధూరి, సీటీఓలు నాగ్రేంద్ర ప్రసాద్, హుసేన్ సాహెబ్, రామాంజనేయ ప్రసాద్, సీటీ ఎన్‌జీఓస్ సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్లు, కమలాకర్, డీసీటీఓలు, ఏసీటీఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement