నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకొన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తికేయ ఏజెన్సీ వ్యవహారాలపై ప్రొఫెసర్ల కమిటీ ఆదివారం సెనెట్ హాలులో బహిరంగ విచారణ జరిపింది.
ఎస్కేయూ : నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకొన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తికేయ ఏజెన్సీ వ్యవహారాలపై ప్రొఫెసర్ల కమిటీ ఆదివారం సెనెట్ హాలులో బహిరంగ విచారణ జరిపింది. అయితే బాధితులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో విచారణ బృందం సభ్యులు ఆచార్య లజపతిరాయ్ (కన్వీనర్), ఆచార్య ఆర్జేడీ భగవత్ కుమార్, ఆచార్య పాల ఇందిర ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఏమి జరిగిందంటే :
వర్సిటీలో సెక్యూరిటీ గార్డులు, అటెండర్లు, డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉద్యోగాలు అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ , నిర్వహణకు కార్తికేయ ఏజెన్సీకి అప్పగించాలని గతేడాది నవంబర్‌లో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు ఇస్తామని ఏజెన్సీవారు లక్షలాది రూపాయలు తీసుకొన్నారని నిరుద్యోగుల నుంచి లేఖలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన బృందం ఎదుట లేఖలు రాసినవారు ఎవరూ హాజరుకాలేదు. కాగా కమిటీ నివేదిక ఆధారంగా వర్సిటీ ఉన్నతాధికారులు కార్తికేయ ఏజెన్సీకి అప్పగించాలా? లేక మరో కంపెనీకి అప్పగించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.