చిత్తూరు జిల్లాకు రెయిన్‌గన్‌లు
నంద్యాలరూరల్: నంద్యాలకు కేటాయించిన రెయిన్ గన్‌లు, స్ప్రింక్లర్లు, పైపులు చిత్తూరు జిల్లా పీలేరుకు తరలిస్తున్నారు. బుధవారం నంద్యాల టెక్కె వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాము నుంచి.. ఏడీఏ సుధాకర్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది దగ్గరుండి లారీల్లో రెయిన్‌గన్‌లు, పైపులు, స్ప్రింకర్లను పంపించారు. ఈ సందర్భంగా ఏడీఏ సుధాకర్ మాట్లాడుతూ.. నంద్యాల సబ్ డివిజన్‌కు కేటాయించిన 140 రెయిన్‌గన్‌లు, 3,500 పైపులు, 420 స్ప్రింకర్లు, 2100 పైపులు 12లారీల్లో పంపామన్నారు. పీలేరులో ఎండిన పంటలను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడి నుంచి వీటిని పంపాల్సి వచ్చిందన్నారు.