జైన్‌కు జై కొట్టారు | Siddharth Jain Transfer in Chittoor | Sakshi
Sakshi News home page

జైన్‌కు జై కొట్టారు

Published Thu, Jul 10 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

జైన్‌కు జై కొట్టారు

జైన్‌కు జై కొట్టారు

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర విభజన తరువాత కేంద్ర సర్వీస్ అధికారుల పంపకంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చినట్టయియంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరుకు ఆయన కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.  పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరును ప్రతి ష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధిపథంలో నడిపిస్తానంటూ ఇటీవలి కాలంలో పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జైన్ ఆ జిల్లా కలెక్టర్‌గా నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
 రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుతోనే కలెక్టర్ బదిలీపై ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జైన్ హైదరాబాద్ వెళ్లి ఆయనను వ్యక్తిగతంగా కలిసినప్పటి నుంచి రేపోమాపో బదిలీ కానున్నట్టు చర్చలు మొదలయ్యాయి. ఆయనను కలెక్టర్‌గా పంపిస్తారా.. మరేదైనా శాఖకు బదిలీ చేస్తారా అన్న ప్రశ్న లూ తలెత్తాయి. అయితే  ఊహించనివిధంగా జైన్‌ను బాబు తన సొంత జిల్లా చిత్తూరుకు కలెక్టర్‌గా పంపించడం అధికార వర్గాల్లో చర్చనీయూంశమైం ది.
 
 ఖమ్మం జిల్లా నుంచి సరిగ్గా ఏడాది క్రితం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయినప్పటి నుంచి జైన్ ఇక్కడ ఓ విధంగా సంక్షోభ పరిస్థితులనే ఎదుర్కొన్నట్టయియంది. వరుస ఎన్నికల నిర్వహణ,  అంతకు ముందు మూడు తుపానులు, సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రెండు నెలలపాటు సమ్మెలు, ఆందోళనలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ జైన్ జిల్లాను అభివృద్ధి బాట పట్టించేందుకు తనవంతు కృషి చేశారు. ఏలూరులో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వూరువుూల ప్రాంతాల నుంచి వ్యయుప్రయూసలకోర్చి వస్తున్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ డివి జన్ కేంద్రాల్లోనూ ఆ కార్యక్రమాన్ని నిర్వహిం చేందుకు ఇటీవలే శ్రీకారం చుట్టారు.
 
 సంకల్పం పేరిట జిల్లాలో ప్రాథమిక విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు యత్నించారు. డెల్టా ఆధునికీకరణ పనులు జైన్ హయాంలో వేగవం తం అయ్యాయి. 2013కు ముందు నాలుగేళ్లలో రూ.120కోట్ల విలువైన పనులు జరగ్గా, ఈయన హయాంలో 11నెలల కాలంలో రూ.100కోట్ల విలువైన పనులు జరిగాయి. అయితే ఆయున తీరు పై ఉద్యోగుల్లో మాత్రం ఒకింత అసంతృప్తి ఉందనే చెప్పాలి. అన్నీ తన పర్యవేక్షణలోనే జరగాలన్న జైన్  ధోరణితో కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడిన సందర్భాలు లేకపోలేదు. ఇదిలావుండగా, ఎన్నికల్లో జిల్లా మొత్తం బీజేపీ పొత్తుతో టీడీపీ స్వీప్ చేసిన నేపథ్యంలో జైన్‌ను బాబు సొంత జిల్లాకు తీసుకువెళ్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.
 
 పశ్చిమ ప్రజలు మంచోళ్లు
 పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు చాలా మంచోళ్లు. అభివృద్ధిని కాంక్షిస్తూ.. ఈ ఒక్క ఏడాదిలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ  ప్రజలు, ప్రజాప్రతినిధులు, సహచర అధికారుల సహకారంతో ముందుకెళ్లగలిగాం. నేను జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సంక్షోభం వస్తూనే ఉంది. వాటిని అధిగమించి జిల్లా అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేశాను. మంచి మనుషులున్న  ఈ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేయడం ఎప్పటికీ మరచిపోలేను.                - సిద్ధార్థజైన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement