చిన్నకందుకూర్ ప్రజల రాస్తారోకో
చిన్నకందుకూర్ ప్రజల రాస్తారోకో
Published Tue, Aug 23 2016 8:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
యాదగిరిగుట్ట: నూతనంగా ఏర్పాటు కానున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాన్ని కలుపొద్దని చిన్నకందుకూర్ గ్రామ ప్రజలు హైదాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆలేరు నుంచి భువనగిరికి వెళ్లే, పుష్కర భక్తుల వాహనాలు భారీ స్థాయిగా స్తంభించాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నమిలె పాండు మాట్లాడుతూ, గతంలో మాదిరిగానే యాదగిరిగుట్ట మండలంలో మమల్ని కొనసాగించాలన్నారు. పారిపాలన దృష్ట్యా యాదగిరిగుట్టనే బాగుంటుందని, మోటకొండూర్‌లో కలువడంతో ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు. మోటకొండూర్‌కు పక్కన ఉన్న మహబూబ్‌పేట, చొల్లేరు గ్రామాలను కలుపకుండా చిన్నకందుకూర్‌ను కలపడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వానికి అభ్యంతరాలను పంపించడానికి త్వరలోనే కలెక్టర్‌ను కలుస్తామని చెప్పారు. రాస్తారోకో చేస్తున్న ప్రదేశానికి ఏఎస్‌ఐ నర్సింగరావు, హెడ్ కానిస్టేబుల్ కుమార్‌లు చేరుకొని ఆందోళన కారులను సముదాయించి, రాస్తారోకో విరమింపజేశారు. ఉపసర్పంచ్ కట్ట మల్లేష్, గ్రామస్థులు చందసాయిబాబు, దూసరి కిష్టయ్య, బడే పోషయ్య, జహంగీర్, ర్యాకల స్వామి, అశోక్, బీమగాని రవి తదితరులున్నారు.
Advertisement