కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం రింగ్‌సెంటర్‌లో ఇటీవల కూల్చివేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు ఆదివారం తిరిగి ప్రతిష్టింపజేశారు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత పుష్కరాల అభివృద్ధి పేరుతో గాంధీజీ విగ్రహాన్ని అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. కూల్చివేసిన విగ్రహాన్ని బుడమేరులో వేయడాన్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, పార్టీ నాయకులు, స్థానికులు ఆందోళనకు దిగారు. గాంధీజీ విగ్రహాన్ని కూల్చేసి కాలువలో పడేసిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. స్పందించిన అధికారులు విగ్రహాన్ని కూల్చిన ప్రాంతంలోనే ఆదివారం మరొక విగ్రహాన్ని ప్రతిష్టించారు.
మహాత్మాగాంధీ విగ్రహం పునఃప్రతిష్ట
Published Sun, Aug 7 2016 6:47 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement