►ఎర్రచందనం దుంగలు స్వాధీనం
►ఇద్దరు తమిళ కూలీల అరెస్టు
►కొనసాగుతున్న కూంబింగ్
భాకరాపేట : టాస్క్‌ఫోర్స్‌పై ఎర్రకూలీలు రాళ్లతో దాడికి దిగిన సంఘటన బుధవారం ఉదయం భాకరాపేట అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు ఆదేశాల మేరకు తెల్లవారుజామున ఆర్‌ఎస్‌ఐ భాస్కర్ నేతృత్వంలో సిబ్బందితో కలసి భాకరాపేట ఘాట్ మార్గం నుంచి కూంబింగ్ నిర్వహించారు. భాకరాపేట అటవీ ప్రాంతంలోని గద్దలగూడు బండల సమీపంలో తమిళ కూలీలు తారసపడ్డారు. ఆర్‌ఎస్‌ఐ భాస్కర్ సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. దీంతో తమిళ కూలీలు వారిపై రాళ్లదాడికి పాల్పడ్డారు.
12 మంది ఉన్న తమిళ కూలీల బృందంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు; మిగిలిన వారు పారిపోయారు. వీరి నుంచి 11 దుంగలు, వెంట తీసుకొచ్చిన బట్టలు, బ్యాగులు, అన్నం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో జువాదిమలైకు చెందిన మనోహర్, రాజేంద్రన్ ఉన్నారు. మిగిలిన వారి కోసం మరో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని డీఐజీ పంపించారు.
టాస్క్‌ఫోర్స్‌పై ఎర్ర కూలీల దాడి
Published Thu, Jun 1 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
Advertisement