14న రెడ్డి మహాగర్జన | reddy mahagarjana on 14th | Sakshi
Sakshi News home page

14న రెడ్డి మహాగర్జన

Published Fri, May 12 2017 11:30 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

reddy mahagarjana on 14th

కర్నూలు(అర్బన్‌): హైదరాబాద్‌ మేడ్చల్‌ చెక్‌పోస్టు సమీపంలోని సాకేత్‌ భూసత్వా మైదానంలో ఈ నెల 14వ తేదీన రెడ్డి మహాగర్జన కార్యక్రమం జరుగుతున్నదని జిల్లా రెడ్డి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొనపాటి యల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక గణేష్‌నగర్‌లోని రెడ్డి భవన్‌లో మహా గర్జనకు సంబంధించిన పోస్టర్లను నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహాగర్జనలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన రెడ్డి ప్రజా ప్రతినిధులందరూ హాజరువుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్డి యువజన సంఘం నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి, ఏ హనుమంతరెడ్డి, తూంకుంట ప్రతాపరెడ్డి, ఎదురూరు రాకేష్‌రెడ్డి, పల్లె శశిధర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, సర్వేశ్వరరెడ్డి, సంపతి లక్ష్మికాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement