
ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్-2 ఫలితాలు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టులో నిర్వహించిన ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం పార్టు-2 పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది. మార్కుల రీ-టోటలింగ్‌కు సబ్జెక్టుకు రూ. రెండు వేలు చొప్పున నవంబరు 7లోపు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయ్‌కుమార్ తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్(హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్)లో పొందవచ్చు.