మిగిలిన ఉల్లి కొనుగోలు | remaining onion purchasing | Sakshi
Sakshi News home page

మిగిలిన ఉల్లి కొనుగోలు

Published Sat, Nov 12 2016 9:47 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

remaining onion purchasing

–పెరిగిన ధరలు 
కర్నూలు(అగ్రికల్చర్‌): వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మిగిలిపోయిన ఉల్లిని ఎట్టకేలకు శనివారం కొనుగోలు చేశారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ శమంతకమణి, కార్యదర్శి నారాయమూర్తిలు చొరవ తీసుకొని తాత్కాలికంగా నగదు కొరతను పరిష్కరించడంతో వ్యాపారులు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు. శనివారం ఉల్లి ధరలు మరింత పెరిగాయి. క్వింటాల్‌ ధర గరిష్టంగా రూ.1080 పలికింది. మొన్నటి వరకు కనిష్ట ధర రూ.50 వరకే ఉండగా.. ఇపుడు రూ.400 పలికింది. పెద్ద నోట్లు రద్దుతో ఉల్లి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో మార్కెట్‌లో  కొరత ఏర్పడటం వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఇక  నగదు కొరత పరిష్కారం అయ్యే వరకు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు ఉండవని అధికార వర్గాలు తెలిపాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement