సుంకేసుల డ్యాం గేట్లకు మరమ్మతులు
జలమండలి ఎస్‌ఈ చంద్రశేఖరరావు
సుంకేసుల(గూడూరు రూరల్): ప్రస్తుతం సుంకేసుల డ్యాంలో నీరు లేకపోవడంతో గేట్లను మరమ్మతులు చేయించనున్నట్లు జలమండలి ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు చెప్పారు. శనివారం ఆయన రిజర్వాయర్‌ను పరిశీలించారు. డ్యాం గేట్లు, కరకట్టల పటిష్టతను పరీక్షించారు. ఎగువ నుంచి డా్యంకు నీరు వచ్చేలోపు గేట్లకు మరమ్మతులు, పేయింటింగ్ వేయించడం, తులుపులకు గ్రీసు తదితర పనులు చేపట్టేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. కర్నూలు ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జీడీపీ నీరు సరఫరా చేస్తామన్నారు. ఆయన వెంట జేఈ శ్రీనివాసులు, వర్క్‌ఇన్‌స్పెక్టర్ మునిస్వామి ఉన్నారు.