ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి | Request for job security | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి

Published Sat, Jul 2 2016 8:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత

 శ్రీకాకుళం పాతబస్టాండ్ : సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సంఘం ప్రతినిధులు శుక్రవారం జాయింట్ కలెక్టర్-2 పి.రజనీ కాంతారావుని కలసి వినతిపత్రం అందజేశారు.
 
 గత ఏడేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో వంటపని వారు, అటెండర్లు, వాచ్‌మెన్ తదితర కేడర్లలో వంద మందికిపైగా అవుట్ సోర్సింగ్  ప్రాతిపదికన పనిచేస్తున్నామని వివరించారు. ఇటీవల కాలంలో బీసీ, ఎస్సీ వసతి గృహాలను ఎత్తివేస్తున్నారని, ఉద్యోగ భద్రత లేకండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల్లోని ఖాళీ స్థానాల్లో నియమించాలని కొరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎంఏ నాయుడు, ఎస్‌వై నాయడు  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement