వైభవంగా సాయినాథుడి రథోత్సవం
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని రైల్వేస్టేషన్ కాలనీలో గల శ్రీసాయిదత్తాశ్రమంలో గురుపౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి వైభవంగా రథోత్సవం నిర్వహించారు.
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని రైల్వేస్టేషన్ కాలనీలో గల శ్రీసాయిదత్తాశ్రమంలో గురుపౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి వైభవంగా రథోత్సవం నిర్వహించారు. మరో రథంలో శ్రీలక్ష్మినారాయణ ఉత్సవ విగ్రహాలను ఉంచారు. తడకమళ్ల బైపాస్ రోడ్డులోని నూనె సోమన్న కిరాణం షాపు వద్ద యాత్రను ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండా శ్రీనివాస్ ప్రారంభించారు. మహిళలు కోలా టం ఆడారు. కార్యక్రమంలో కమిటీ ఉపా«ధ్యక్షుడు ప్రతాఫ్, ప్రధాన కార్యదర్శి నరేందర్, జగన్నాథరావు, మట్టయ్య, పందిరి సత్యనారాయణ, సోమన్న, జానకిరాముడు, వాసు, అశ్విన్‌మిత్ర, శివ తరుణ్, రవిశంకర్, రాజేష్, రఘు, చంద్రకాంత్, రవిలున్నారు.
హనుమాన్‌పేటలో గల శ్రీసాయిబాబా ఆలయం నుంచి స్వామివారిని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు మంచుకొండ వెంకటేశ్వర్లు, విగ్రహాల సుధాకర్‌రావు, గంధం సైదులు, పెండ్యాల పద్మావతి, నాగరాజు, సీతమ్మ, చారి ఉన్నారు.