నోట్ల రద్దు నేపథ్యంలో ఇక నుంచి అన్ని రకాల వ్యాపార లావాదేవీలు నగదు రహితంగా నిర్వహించడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ సి.సుధాకర్ ఆదేశించారు.
- రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించండి
- మార్కెట్ యార్డు సెక్రటరీలకు ఆర్జేడీ ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్ : నోట్ల రద్దు నేపథ్యంలో ఇక నుంచి అన్ని రకాల వ్యాపార లావాదేవీలు నగదు రహితంగా నిర్వహించడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ సి.సుధాకర్ ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక మార్కెట్‌యార్డులో ఏడీ బి.హిమశైలతో కలిసి 13 మార్కెట్‌యార్డు కమిటీ సెక్రటరీలు, సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందులో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా నగదు రహితంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని, యార్డులు, చెక్‌పోస్టులలో స్వైప్‌మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్ ఫీజు వసూళ్లలో అనుకున్నదానికన్నా ఈ సారి రూ.కోటి వరకు వెనుకబడ్డారని, ఇప్పటికైనా ఆ దిశగా దృష్టి సారించాలని చెప్పారు. యార్డులు, చెక్‌పోస్టులపై దృష్టి సారించి మార్చి నెలాఖరుకు రూ.17.11 కోట్లు రాబడి సాధించాలని ఆదేశించారు. ఏడీ హిమశైలజ మాట్లాడుతూ 60 స్వైప్‌మిషన్లు అవసరమని ఇప్పటికే దరఖాస్తు చేశామని, రెండు మూడు రోజుల్లో కొన్నింటిని బిగిస్తామని చెప్పారు.