నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా పదిమందికి గాయాలయ్యాయి. చిట్యాల మండలం ఎలిమినేడు గ్రామ శివారులు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.