ట్రాక్టర్, ఆటో ఢీకొని విద్యార్థి మృతి | road accident-student dies | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, ఆటో ఢీకొని విద్యార్థి మృతి

Published Mon, Aug 22 2016 11:43 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

road accident-student dies

కోడేరు : పుష్కర స్నానాలు ఆచరించి తల్లిదండ్రులతో కలిసి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కోడేరు చెందిన రామదాసు (16) ప్రస్తుతం వనపర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వచ్చాడు.
 
సోమవారం ఉదయం తల్లిదండ్రులు శ్యామలమ్మ, వెంకటయ్యలతో కలిసి సోమశిల ఘాట్‌లో స్నానమాచరించేందుకు ఆటోలో Ðð ళ్లారు. అనంతరం ఆలయాల్లో పూజలు నిర్వహించి మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని నర్సాయిపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఈ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందడంతో వారు గుండెలవిసేలా రోదించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement