కరీంనగర్ జిల్లాలో ఐటీ టవర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు.
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లాలో ఐటీ టవర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఐటీ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.25 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు.
హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు పరిమితమైన ఐటీ కంపెనీలన్ని కరీంనగర్‌లోని ఐటీ టవర్స్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని యువతకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పిస్తాయని తెలిపారు. జిల్లాల పునర్విభజనతో కరీంనగర్‌కు ప్రాధాన్యం తగ్గలేదని, భవిష్యత్తులో వైద్య, విద్యరంగాల్లో తెలంగాణలోనే ముందంజలో ఉంటుందన్నారు.