- అవగాహన సదస్సులో ఏవో అరుణాబాయి
2 నుంచి ఆన్‌లైన్‌లో రవాణా శాఖ సేవలు
Published Sun, Jul 24 2016 11:36 PM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM
మంచిర్యాల రూరల్ : ఆగస్టు 2వ తేదీ నుంచి రవాణా శాఖ సేవలన్నీ ఆన్‌లైన్‌లోని నిర్వహించనున్నట్లు మంచిర్యాల రవాణా శాఖ(ఆర్టీఏ) పరిపాలనాధికారి(ఏవో) అరుణాబాయి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మంచిర్యాల మండలంలోని వేంపల్లి గ్రామంలో గల ఆర్టీఏ కార్యాలయంలో మీసేవ, ఈసేవ, ఆన్‌లైన్ నిర్వాహకులకు రవాణా శాఖ ఆన్‌లైన్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, జిల్లా రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ వ్యవస్థపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామని తెలిపారు. ఇక రవాణా శాఖా సేవలను వినియోగించుకునే వాహన చోదకులు మీసేవ, ఈసేవ, ఆన్‌లైన్ కేంద్రాలకు వస్తే ఆర్టీఏ శాఖ నియమ నిబంధనల మేరకు సూచించిన ఫీజులను వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ తదితర రవాణా శాఖ సేవలన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే పొందాలని సూచించారు. మంచిర్యాల పరిధిలోని మీసేవ, ఈసేవ, ఆన్‌లైన్ నిర్వాహకులు, ఆర్టీఏ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రఫీ పాల్గొన్నారు.
Advertisement
Advertisement