కామన్ సర్వీసు రూల్స్‌ను అమలు చేయాలి
సారంగాపూర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యాజామాన్యల కింద పనిచేస్తున్న ఉపాద్యాయులకు కామన్ సర్వీసు రూల్స్‌ను అమలు చేయాలని డీటీఎఫ్ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు చంద్రశేఖర్, సుధాకర్‌లు అన్నారు. మండలంలోని జామ్ సారంగాపూర్, తదితర గ్రామాల్లో బుధవారం పర్యటించి డిసెంబరు 10, 11, 12వతేదీల్లో నల్గొండలో జరిగే డీటీఎఫ్ 4వ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రాష్ర్టం సంక్షోభంలో కూరుకుపోతోందని అన్నారు. ఎన్నో యేళ్లుగా ఎదిరిచూస్తున్న కామన్ సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే కంట్రీబ్యూటరి పెన్షన్ విధానం రద్దు చేసీ పీఈటీలకు, పండిత్‌లను అప్‌గ్రెడేషన్ చేయాలని కోరారు. పీఆర్‌సీ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని దీనివల్ల ఉపాద్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో డీటీఎఫ్ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉపాద్యాయలు ఎదుర్కొంటున్న ధీర్ఘకాలిక సమస్యలపై పోరాటం సాగించి వాటి పరిష్కారానికి కృషిచేస్తామని వ్యాఖ్యానించారు. ఈ మహాసభలకు ఉపాద్యాయులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాద్రి, జామ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులు రమేష్‌రావు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.