
'నరేంద్ర మోదీని చూస్తే ఆయనకు వణుకు'
హైదరాబాద్:సమైక్యాంధ్ర విభజనలో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శించారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందిగా లేఖ ఇచ్చి.. రాష్ట్ర విభజనలో చంద్రబాబు పాలుపంచుకున్నారన్నారు. చంద్రబాబు తాజాగా రూపొందించిన విధాన పత్రం ప్రత్యేక హోదా ఉద్యమానికి వెన్నుపోటు పొడించేందుకేనన్నారు.
ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చంద్రబాబు నాయుడు తాకట్టుపెట్టారని శైలజానాథ్ మండిపడ్డారు. నరేంద్ర మోదీని చూస్తే చంద్రబాబు వణుకుపుడుతుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ మరింత ఉధృతంగా పోరాడుతుందని శైలజానాథ్ పేర్కొన్నారు.