క్రీడలు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి
కంబదూరు : క్రీడలు మానసికోల్లాసాన్నినివ్వడంతో పాటు శరీరక దృఢత్వాన్ని ఇస్తాయని స్టేట్‌బ్యాంక్ మేనేజర్ విష్ణువర్దన్, మాజీ ఎంపీపీ లక్ష్మినారాయణ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సైనానెహ్వాల్– 5 జోన్ బాలుర గ్రిగ్స్ పోటీల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం జరిగిన వాలీబాల్, హ్యండ్‌బాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, త్రోబాల్, టెన్నికాయిట్ పోటీల్లో కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి 60 పాఠశాలలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పోటీలు నిర్వహించారు.
రెండోరోజు విజేత జట్ల వివరాలివీ.. : రెండో రోజు సెనానెహ్వాల్ జోన్–5 గ్రిగ్స్ పోటీల్లో భాగంగా రెండో రోజు జరిగిన మ్యాచ్‌ల వివరాలిలా ఉన్నాయి. సీనియర్ బాస్కెట్ బాల్ విభాగంలో కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప హైస్కూల్–కంబదూరు హైస్కూల్ జట్లు తలపడ్డాయి. ఇందులో కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప హైస్కూల్ జట్టు విజయం సాధించింది. జూనియర్ బాస్కెట్‌బాల్ విభాగంలో కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప హైస్కూల్–రాయదుర్గం హైస్కూల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కరణం చిక్కప్ప హైస్కూల్ జట్టు విజయం సాధించింది.
జూనియర్ సాఫ్ట్‌బాల్ విభాగంలో కణేకల్లు హైస్కూల్–ముద్దినాయినిపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కణేకల్లు జట్టు గెలుపొందింది. సీనియర్ హ్యండ్‌బాల్ పోటీల్లో కళ్యాణదుర్గం జట్టుపై కంబదూరు హైస్కూల్ జట్టు విజయం సాధించింది. సీనియర్ త్రోబాల్ పోటీల్లో కంబదూరు, గంగవరం, కణేకల్లు, మాల్యం హైస్కూల్ జట్లు సెమిస్‌కు చేరాయి. జూనియర్ టెన్నికాయిట్ పోటీల్లో మాల్యం జట్టు ఫైనల్‌కు చేరింది. సీనియర్ చెస్ పోటీల్లో కంబదూరు జట్టు ఫైనల్‌కు చేరింది. సీనియర్ కబడ్డీ పోటీల్లో ఉడేగోళం జట్టు కణేకల్లు జట్టుపై విజయం సాధించి సెమిఫైనల్‌కు చేరినట్లు పీఈటీ మురళి తెలిపారు.