ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సాక్షి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే ఈ ప్రసారాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని పలు జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. ప్రసారాలను అకారణంగా నిలిపివేయడం సరికాదని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. ఇది భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్య అని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్‌నాథ్ మండిపడ్డారు.
'సాక్షి' టీవీ ప్రసారాలు నిలిపివేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూలు ఖండించాయి. 'సాక్షి' ప్రసారాలు నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డాయి. రాజకీయ ఒత్తిళ్లుకు లొంగకుండా తక్షణమే ప్రసారాలు పునరుద్దరించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు మల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి ఐపీ సుబ్బారావు, ఐజీయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు డిమాండ్ చేశారు.
ఏపీలో నిలిచిన సాక్షి టీవీ ప్రసారాలు
Published Thu, Jun 9 2016 5:39 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement