
ఘనంగా సంగమేశ్వరుడి వసంతోత్సవం
కూడేరు : స్థానిక శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వడి బ్రహ్మోత్సవాలు గురువారం వసంతోత్సవంతో ముగిశాయి. జోడు లింగాలకు పురోహితుడు శివశంకర్ శాస్త్రి, అర్చకుడు మహేష్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపు చేశారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను కోనేటి వద్ద పవిత్ర జలంతో వేదపండితులు అభిషేకం చేశారు .జోడు లింగాలను దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు పోనుగంటి వారు అన్నదానం చేశారు. ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అక్కి రెడ్డి , ఆలయ సేవా కమిటీ, జీర్ణోద్ధరణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.