
ఘనంగా శతచండీ సహిత రుద్రయాగం
లోక కల్యాణార్థం దుర్గగుడిలో నిర్వహిస్తున్న శతచండీ సహిత రుద్రయాగం రెండోరోజైన గురువారం కూడా వైభవంగా జరిగింది.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : లోక కల్యాణార్థం దుర్గగుడిలో నిర్వహిస్తున్న శతచండీ సహిత రుద్రయాగం రెండోరోజైన గురువారం కూడా వైభవంగా జరిగింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ యాగంలో దుర్గా సప్తశతి పారాయణ, హోమం నిర్వహిస్తున్నారు. అర్జునవీధిలోని మహా మండపం సమీపంలోని యాగశాలలో ఈ యాగాన్ని రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వైదిక కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.