ఆర్టీసీని కాపాడుకుందాం | save rtc | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని కాపాడుకుందాం

Published Thu, Sep 8 2016 11:57 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

ఆర్టీసీని కాపాడుకుందాం - Sakshi

ఆర్టీసీని కాపాడుకుందాం

  • చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ
  • ఉద్యోగుల అభినందన సభకు హాజరు
  • ఆదిలాబాద్‌లో సంస్థ వైద్యశాల తనిఖీ
  • 35 బస్సులు, 26 మినీ బస్సుల మంజూరు
  • ఈ ఏడాది రూ.500 కోట్ల టర్నోవర్‌ చేయాలి
  • జిల్లాల విస్తరణతో మార్పు ఉండవచ్చు
  • ఆదిలాబాద్‌ కల్చరల్‌ : ఆర్టీసీని అందరం కలిసి కాపాడుకోవాలని, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఆర్టీసీ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో మందుల కొరత, వైద్య సదుపాయం, రెఫరింగ్‌ ఎక్కడ చేస్తారు అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. డిపో ఆవరణలో మొక్కలు నాటారు.
     
    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ సంస్థ ఏడు వందల కోట్ల నష్టంలో కూరుకుపోయిందని, దీనిని లాభాల బాటలో నడిపించాలంటే 5 వందల కోట్ల టర్నోవర్‌ ఈ సంవత్సరం చేయాలని పేర్కొన్నారు. ప్రతీ గ్రామానికి బస్సులు తిప్పాలని, నష్టాలు వచ్చే మార్గాలను రద్దు చేసి, లాభాలు ఉండే రోడ్లలో గ్రామాలకు వెళ్లాలని తెలిపారు. జిల్లాకు 35 ఆర్టీసీ బస్సులు, 26 మినీ బస్సులు మంజూరు చేయనున్నట్లు వివరించారు. ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడిపించే కృషి చేస్తామన్నారు.
     
    సమయపాలనతోనే ఆదరణ
    సమయపాలన పాటిస్తేనే ప్రయాణికులు ఆదరిస్తారని చైర్మన్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. బస్టాప్‌లలో బస్సులు వచ్చే వేళల బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. తాను కూడా కార్మికుడిలా పనిచేసి సంస్థ పరిరక్షణకు పాటుపడతానని చెప్పారు. అభివృద్ధి కోసం ఆర్టీసీ స్థలాలలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, లాడ్జిలు, హోటల్స్‌ ఇతర వ్యాపార సముదాయాలు స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. గతేడాది రూ.4 వందల కోట్ల టర్నోవర్‌ చేశామని, ఈ ఏడాది రూ.5 వందల కోట్లు అవసరమని చెప్పారు. జిల్లాల ఏర్పాటులో కొన్ని మార్పులు చేకూరే అవకాశాలు ఉండవచ్చని చెప్పారు. ప్రమాదాలను జీరో స్థాయి నివారించాలని, జీరో బ్రేక్‌గా వాహనాలను నడపాలని చెప్పారు.
     
    ఎల్లవేళలా కార్మికులకు అందుబాటులోఉంటామని, తనను అన్నదమ్ముడిలా భావించాలని కోరారు. ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ విజయకుమార్, డిప్యూటీ సీటీఎం శరత్‌ప్రసాద్, డిప్యూటీ సీఎంఈ మధుసూదన్, ఆదిలాబాద్‌ డీఎం సాయన్న, టీఎంయూ రీజినల్‌ ప్రెసిడెంట్‌ ఏఆర్‌.రెడ్డి, కిషన్, జీఆర్‌మౌళి, బీడీ చారి, ఎంప్లాÄæూస్‌ యూనియన్‌ రీజినల్‌ సెక్రెటరీ వెంకటయ్య, ఆర్టీసీ సూపర్‌వైజర్ల సంఘం రీజినల్‌ సెక్రెటరీ కె.మోహన్, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజినల్‌ సెక్రెటరీ భీంరావు, డిపో సెక్రెటరీ ఆశన్న పాల్గొన్నారు.
     
    ఉత్తమ ఉద్యోగులకు సత్కారం
    డిపోలోని ఉత్తమ కండక్టర్లకు, ఉత్తమ డ్రైవర్లకు ఆర్టీసీ చైర్మన్‌ సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఉత్తమ డ్రైవర్‌గా రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్న వి.సుభాష్‌ను అభినందించారు. ఆదిలాబాద్‌ డిపో నుంచి కండక్టర్లు కేజీ.రామ్, ఎ.దేవన్న, ఎన్‌.సంజయ్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ నుంచి రవిందర్, శ్రీనివాస్, శ్రీధర్, భైంసా నుంచి రహిమాన్, శంకర్, అంజయ్య, మంచిర్యాల నుంచి ఆస్పక్‌ అహ్మద్, ముకీబ్, కేశన్న, నిర్మల్‌ నుంచి ఎంఎస్‌.రెడ్డి, జె.శంకర్, బి.ఉశన్న, ఉట్నూర్‌ నుంచి ఆర్‌.లక్ష్మణ్, ఎస్‌.లక్ష్మణ్, బి.పి.కుమార్‌లను ఉత్తమ కలెక్షన్‌ తెచ్చినందుకు గానూ సత్కరించారు.
     
    ఇంధనం పొదుపు చేసినందుకు గానూ ఆదిలాబాద్‌ డిపో నుంచి కె.రాజేశ్వర్, ఏ.ఎస్‌.రావు, ఆసిఫాబాద్‌ నుంచి బీ.ఆర్‌.కుమార్, ఎండీ జహూర్, భైంసా నుంచి ఎ.కలీమ్, ఎం.ఖాన్, మంచిర్యాల నుంచి సీహెచ్‌.లింగయ్య, ఎల్‌ఎస్‌.రావు, నిర్మల్‌ నుంచి ఎండీ ఖాన్, రాజేందర్, ఉట్నూర్‌ నుంచి జె.కొమురయ్య, డి.ఆర్‌.చందర్‌లను సత్కరించి నగదు పురస్కారాలు అందజేశారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement