Published
Fri, Aug 5 2016 8:17 PM
| Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
పాఠశాల గదుల ప్రారంభించిన ఎమ్మెల్యే
తిరుమలగిరి : పాఠశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఈటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన గదులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొమ్మినేని సతీష్, జెడ్పీటీసీ సభ్యురాలు పేరాల పూలమ్మ, వైస్ ఎంపీపీ సుంకరి జనార్దన్, సర్పంచ్‌లు చంద్రమౌళి, హరిశ్చంద్రనాయక్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి, యాదవరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జయమ్మ, తహసీల్దార్ జగన్నాథరావు, ఎంఈఓ కాంతయ్య, ప్రధానోపాధ్యాయులు మల్లేష్, ఉప్పలయ్య, శోభన్‌బాబు, యాదగిరి, రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.