ఈనెల 15వ తేదిన తమ పాఠశాలలో శాస్త్ర సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ప్రధానాచార్యులు పురం చంద్రకళ శనివారం ఓప్రకటనలో తెలిపారు.
మెదక్: ఈనెల 15వ తేదిన తమ పాఠశాలలో శాస్త్ర సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ప్రధానాచార్యులు పురం చంద్రకళ శనివారం ఓప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందించడానికి భారత ప్రభుత్వ సాంస్క ృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యా భారతి సంస్క ృతి శిక్షా సంస్థాన్, కురుక్షేత్ర ద్వారా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే ఈ ప్రదర్శనలో పట్టణంలోని 12 పాఠశాలల నుంచి సుమారు 500మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.