ఘనంగా స్కోర్‌మోర్ అవార్డుల ప్రదానం
ఘనంగా స్కోర్‌మోర్ అవార్డుల ప్రదానం
Published Sun, Sep 18 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
విజయవాడ కల్చరల్:
భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక స్కోర్ మోర్ ఫౌండేషన్ అని సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు అభినందించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురంలో విద్యాశిరోమణి పురస్కారాల సభ ఆదివారం జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ తుర్లపాటి పట్టాభిరాం మాట్లాడుతూ ప్రతిభ పెద్దపీట వేస్తామన్నారు. జర్నలిస్ట్ సంఘం నేత అంబటి ఆంజనేయులు, ప్రవాసాంధ్ర నాట్య కళాకారిణి డాక్టర్ సుధ, రవి పబ్లిషర్స్ అధినేత అంజనేయరావు ప్రసంగించారు, ప్రత్యేక పురస్కారం డాక్టర్ దార్లనాగేశ్వరరావు, ఉత్తమ పబ్లిషర్ పురస్కారం రవి పబ్లిషర్స్ అధినేత ఎం.ఆంజనేయరావుకు, డాక్టర్ క్రోవి పార్థసారధిలకు విశిష్టవిద్యాశిరోమణి పురస్కారాల్ని బహూకరించారు.
వీరికే పురస్కారాలు
విద్యాశిరోమణి పురస్కారాలను ఎల్‌ఆర్. వెంకటరమణ, కె. కృష్ణసాయిబాబు, కండల చందన, ప్రొ. నాదెండ్ల రామారావు, వై.సత్యనారాయణ మూర్తి, కెవీ. నారాయణరావు, కాసుల పద్మావతి, గంగరాజు చిట్టి, జీ,ఆంజనేయ శాస్త్రి, భాస్కరరాజు, సుంకర శ్రీనివాస రావు.బీ రాజేశ్వరరావు, దేవరపల్లి బెనర్జీ, అబిన్ అలెక్స్. డాక్టర్ రమణ గంగిరెడ్డి, సుధా స్రవంతి, డాక్టర్ సుమితా బోస్‌లకు అందజేశారు, ప్రతిభా పురస్కారాలను డాక్టర్ సుధ (అమెరికా), ఘట్టం వెంకటేష్‌లకు అందజేశారు.
Advertisement