ఒకేరోజు 1200 మంది ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌ | sgt counsling | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 1200 మంది ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌

Published Mon, Jul 31 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

ఒకేరోజు 1200 మంది ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌

ఒకేరోజు 1200 మంది ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌

-వేగవంతమైన ప్రక్రియ 
-అకాలవర్షంతో ఇబ్బందిపడ్డ ఉపాధ్యాయులు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. షెడ్యూల్‌ ప్రకారం గడువులోపు ముగుస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమైన తరుణంలో ఆదివారం ఒక్క రోజే 1200 మంది స్పెషల్‌ గ్రేడ్‌ టీచర్లకు(ఎస్‌జీటీలకు) కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారందరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండడంతో దాదాపు 1500 మంది వరకూ తప్పనిసరి బదిలీలు కావాలి్సన ఉపాధ్యాయులు శని ఆదివారాల్లో కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. పాయింట్లు అధికంగా ఉండి తమకు కావాలి్సన ప్రాంతాల్లో చోటు లభిస్తుందని భావించి దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయుల్లో చాలా మందికి కోరుకున్న చోటు దక్కడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత వేగవంతమైంది.  సోమవారం  2001 నుంచి 3105 నంబర్‌ వరకూ ఉన్న ఎస్‌జీటీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్‌ఎస్‌ గంగా భవానీ తెలిపారు. వీరితోపాటు ఏజెన్సీ ప్రాంత ఎస్‌జీటీలకు, ప్రభుత్వ ఎస్‌జీటీలకు, అడ్‌హక్‌ పదోన్నతులు పొందిన స్కూల్‌ అసిస్టెంట్లకూ సోమవారమే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం కౌన్సెలింగ్‌ జరుగుతుండగా సాయంత్రం సుమారు 4.30 గంటల నుంచి మొదలైన వర్షం వల్ల ఉపాధ్యాయులు అసౌకర్యానికి గురయ్యారు. టెంట్లలో వర్షపు నీరు కారడంతో కౌన్సెలింగ్‌ కొద్దిసేపు నిలిచింది.  
వారంలో విధుల్లో చేరాలి
బదిలీ అయిన ఉపాధ్యాయులు వారంలోగా కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉందని డీఈఓ ఆర్‌.ఎస్‌.గంగా భవానీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్‌చేసే విషయంలో కొన్ని సూచనలు పాటించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. 
lఒక్క ఉపాధ్యాయుడు/ సబ్జెక్ట్‌  టీచర్‌ ఉన్న పాఠశాలలో ఆ స్థానంలో వేరొక టీచర్‌ వచ్చే వరకూ రిలీవ్‌ చేయరాదు.  
lఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలో ఇద్దరూ బదిలీ అయ్యి ఉత్తర్వులు పొందితే వారిలో జూనియర్‌ ఉపాధ్యాయుడు తన సబ్‌స్టిట్యూట్‌ వచ్చే వరకూ రిలీవ్‌ కారాదు. 
lముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో ముగ్గురూ బదిలీ ఉత్తర్వులు పొందితే వారిలో ఇద్దరు జూనియర్‌ టీచర్లు తమ సబ్‌స్టిట్యూట్‌ వచ్చే వరకూ రిలీవ్‌ కారాదు.
lనలుగురు ఉపాధ్యాయులున్న పాఠశాలలో నలుగురూ బదిలీ ఉత్తర్వులు పొందితే వారిలో ఇద్దరు జూనియర్‌ ఉపాధ్యాయులు తమ స్థానంలో వేరొకరు వచ్చే వరకూ రిలీవ్‌ కాకూడదు.
l11 మంది  పనిచేస్తున్న పాఠశాలలో అందరూ బదిలీ అయితే వారిలో ఆరుగురు జూనియర్లు సబ్‌స్టిట్యూట్‌ వచ్చే వరకూ రిలీవ్‌ కారాదు.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement