త్వరలో అమ్మవారికి అష్టమాతృకల వెండి కవచం
Published Fri, Jul 22 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
హన్మకొండ కల్చరల్ : మహారాష్ట్రలోని కొల్హాపురి దేవాలయంలో కొలువుదీరిన అమ్మవారి మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి కూడా అష్టమాతృకల వెండికవచం ఏర్పాటు చేసేందుకు దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భద్రకాళి దేవాలయంలోని పలు పంచలోహ విగ్రహాలను రూపొందించిన తమిళనాడు కుంభకోణంకు చెందిన ప్రముఖ శిల్పి స్థపతిశేఖర కవచం డిజైనింగ్‌ను అధికారులకు సమర్పించారు. అష్టమాతృకలకు 20 కిలోల వెండి కావాల్సి ఉండగా.. జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త టాటా సెలెక్ట్ మోటార్స్ అధినేత ముప్పిడి విజయ్‌కుమార్‌రెడ్డి 17 కిలోలు, సర్వస్వతీభట్ల రాజేశ్వరశర్మ 2 కిలోలు, డాక్టర్ ఉపేందర్ కిలో వెండిని సమకూర్చారు. ఈ మేరకు గురువారం సాయంత్రం వారు మొత్తం 20 కిలోల వెండిని దేవాలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు చేతుల మీదుగా స్థపతిశేఖరకు అం దజేశారు. ఈ సందర్భంగా స్థపతిశేఖర మాట్లాడుతూ కవచం తయారు చేసేందుకు 45 రోజుల సమయం పడుతుం దన్నారు. ఆశ్వయుజ మాసంలో జరిగే దేవీనవరాత్రుల్లోగా కవచం తయారు చేసి అందజేస్తానని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement