‘చలో హైదరాబాద్’ విజయవంతం చే యాలి
Published Tue, Aug 2 2016 9:20 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
నిర్మల్‌రూరల్ : ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా ప్రధాన కార్యదర్శి రాంనరేశ్ కోరారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌వద్ద సామూహిక నిరాహార దీక్ష ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, హెల్త్‌కార్డులపై అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యసేవ అందించాలని, కామన్ సర్వీస్‌రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టాలన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం తపస్ చేపట్టిన ఆందోళనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement