బిల్లులిస్తేనే తాళం తీస్తా..!
♦ పరిగిలో పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయిన కాంట్రాక్టర్
♦ వరండాలోనే విద్యార్థులకు తరగతులు బోధించిన టీచర్లు
పరిగి : భవన నిర్మాణానికి సంబంధిం చిన బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్ వి ద్యార్థులను బయటికి పంపించి పాఠశాలకు తాళం వేశాడు. బిల్లులు వచ్చిం తర్వాతే తాళం తీస్తానని వెళ్లిపోయాడు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి తరగతులు నిర్వహించాల్సి వచ్చిన సంఘటన గురువారం పరిగిలో చోటుచేసుకుంది. పరిగిలోని నంబర్-1 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గదుల కొరత తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం గత ఏడాది అదనపు గదుల కోసం రూ. 42 లక్షలు మంజూరు చేసింది. టెండర్లలో కాంట్రాక్టు పనులు దక్కించుకున్న బోజ్యా నాయక్ అనే వ్యక్తి ఆరు గదులు నిర్మించి గత వేసవిలో పనులు పూర్తి చేశాడు.
పాఠశాలకు గదులు సరిపడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంతో జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి నూత న భవనంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. గురువారం పాఠశాలకు వచ్చిన కా్రంటాక్టర్ బోజ్యా నాయ క్ పాఠశాలకు తాళం వేశాడు. ఉపాధ్యాయులు కారణం అడగ్గా.. తనకు రూ. 42 లక్షలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.16 లక్షలు మాత్ర మే వచ్చాయని, తనకు బిల్లులు రానందునే తాళం వేశానని చెప్పాడు. ఉపాధ్యాయులు చేసేదేమీలేక విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి తరగతులు నిర్వహించారు.