సింధుకు ఏసీఏ రూ.25 లక్షల నజరానా
విజయవాడ స్పోర్ట్స్ :
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రూ.25 లక్షల నజరానా ప్రకటించింది. కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.10 లక్షలు నజరానా అందించింది. ఐజీఎంసీ స్టేడియంలో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు చేతులు మీదుగా నగదు చెక్కులను సింధు, గోపీచంద్ అందుకున్నారు.