వరంగల్‌కు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్
♦ మంజూరు చేసిన కేంద్రం
♦ సుశిక్షితులైన డ్రైవర్లుగా తయారు చేయడమే లక్ష్యం
♦ యువత స్వయం ఉపాధికి అవకాశం
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ మం జూరు చేసింది. యువత స్వయం ఉపాధి పొం దే అవకాశం కల్పిం చింది. ఈ సెంటర్ ద్వారా యువతకు మోటారు డ్రైవింగ్‌లో నైపుణ్యం కలిగిన శిక్షణ ఇస్తారు. దేశంలో డ్రైవింగ్ విభాగంలో 100 స్కిల్ డెవలప్‌మెంట్ సెంట ర్లు ఏర్పాటు చేస్తుండగా ఇందులో మూడు రాష్ట్రాని కి మంజూరయ్యాయి. వాటిలో ఒకటి వరం గల్‌కు కేటాయిం చింది. మిగతా రెండు హైదరాబాద్‌కు మంజూరయ్యాయి. తెలంగా ణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వీటి నిర్వహణ బాధ్యత తీసుకుంది. రవాణా రంగంలో విశేష అనుభవం ఉన్న ఆర్టీసీకి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ సిబ్బంది శిక్షణ కాలేజీ, ట్రైనింగ్ అకాడమీతోపాటు వరంగల్‌లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు మంజూరయ్యాయి. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ల ద్వారా సుశిక్షితులైన డ్రైవర్లను తయారు చేస్తారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, వీరికి ఈ దిశగా అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్‌తో పాటు డ్రైవింగ్ ట్రాక్, ఇతర సౌకర్యాలు, శిక్షణ పరికరాల సమకూర్చుకోవడానికి ఒక్కో సెంటర్‌కు కేంద్రం రూ.కోటి కేటాయించింది.
ఇందులో రూ.50 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో డ్రైవింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శిక్షణ పొందిన వారికి ఇతర సంస్థలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వచ్చే నెల 15న దేశ వ్యాప్తంగా ఒకే రోజు 100 స్కిల్ డెవలప్‌మెంట్ సెటర్లను ప్రారంభించనున్నారు. డ్రైవింగ్ శిక్షణకు సంబం ధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.