కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న ప్రజాసాధికార సర్వే ముగింపు దశకు వచ్చింది. సర్వే పరిధిలోకి రాని వారి గురించి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు కారణాలు వివరిస్తున్నారు. జనాభా లెక్కల(2011) ప్రకారం జిల్లాలో 40,33,180 మంది ఉన్నారు. అయితే 35,46,235 మందిని సర్వే చేశారు. సర్వేకు 4,86,945 మంది దూరంగా ఉన్నారు. వీరిని సర్వే చేయకపోవడానికి తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు కారణాలు తెలుపుతున్నారు. 25072 మంది మరణించినట్లు, 1,99,716 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు.. 33456 మంది మహిళలు వివాహాలు చేసుకొని అత్తింటికి వెళ్లినట్లు.. ప్రజాసాధికార సర్వేకు 6959 మంది ఇష్టం చూపనటున్ల.. 21,713 ఇళ్లకు తాళం వేసి నట్లు.. 14,258 మందికి ఆధార్ నంబర్లు లేవని స్పష్టం చేస్తున్నారు. అలాగే 12,460 మందికి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఇంకా 173041 మందికి సంబందించిన వివరాలు రాలేదు.