ఏఆర్ హెడ్‌క్వాటర్స్ తనిఖీ చేసిన ఎస్పీ
ఏఆర్ హెడ్‌క్వాటర్స్ తనిఖీ చేసిన ఎస్పీ
Published Wed, Nov 2 2016 11:13 PM | Last Updated on Mon, Apr 8 2019 8:33 PM
– స్పెషల్ పార్టీ సిబ్బందికి ఇస్తున్న ఆయుధాల శిక్షణ పరిశీలన
కర్నూలు: జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్మ్‌డు రిజర్వ్‌డ్ హెడ్ క్వాటర్స్‌ను ఎస్పీ ఆకే రవికృష్ణ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఏఆర్ హెడ్ క్వాటర్స్‌కు చేరుకోగానే సిబ్బంది ఎస్పీకి గౌరవవందనం చేశారు. తనిఖీల్లో భాగంగా ముందుగా ఆయుధాగారం (బెల్లాఫాం) చుట్టూ ఉన్న రక్షణ గోడగా ఉండే సోలార్ ఫెన్షింగ్ (కంచె)ను పరిశీలించారు. కమ్యూనికేషన్ సెట్లను మోటర్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు వద్ద ఉండే డ్రైవర్ల విశ్రాంతి గదులను, షటిల్‌కోర్టు, వ్యాయామ శాల, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం కార్యాలయం, గ్యాస్ గోదాము, సెంట్రల్ క్యాంటీన్, సమృద్ధి క్యాంటీన్, ఏఆర్‌ప్లటూన్, స్టాక్ రిజిస్ట్రర్‌లు, ఆయుధాలు, కోర్టు ప్రాపర్టీ రికార్డులతో పాటు క్యాష్ బుక్‌లను తనిఖీ చేశారు. బీడీ టీమ్ రికార్డులు, ఆయుధాగారంలో ఉన్న ఆయుధాల పనితీరును పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న పాత ఇనుప సామగ్రిని డిస్పోజబుల్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పరేడ్ మైదానంలో స్పెషల్‌పార్టీ పోలీసులకు ఇస్తున్న ఆయుధాల శిక్షణ గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఐ.వెంకటేష్, ఆర్‌ఐలు జార్జీ, రంగముని, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement