వైభవంగా ఊంజల్‌సేవ
రాపూరు: పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి శనివారం రాత్రి ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామికి సుప్రభాతసేవ, 6 గంటలకు అభిషేకం, 7 గంటలకు పూలంగిసేవ నిర్వహించారు. ఉదయం 11గంటలకు నిత్య కల్యాణ మండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి,చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై సహస్రదీపాలంకరణ మండపంలో కొలువుదీర్చి ఊంజల్‌సేవ నిర్వహించారు.