సాక్షి, నెట్‌వర్క్: సాక్షి, నెట్‌వర్క్: కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌ను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఒకవైపు పోలీసు కమిషనర్‌ను సాగనంపుతూనే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు ప్రారం భించింది. దీని ద్వారా అసలు అరాచకం నుం చి ప్రజల దృష్టిని మళ్లించే కుతంత్రానికి తెర లేపింది. పోలీసులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అనుమానితుల ఇళ్లపై దాడులు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 107 ప్రాంతాల్లో దాడు లు చేసి 86 మందిని అదుపులోకి తీసుకున్నా రు. వీరి నుంచి 1,012 ప్రామిసరీ నోట్లు, 252 ఖాళీ చెక్కులు, 28 స్టాంపు పత్రాలు, 374 ఆస్తి పత్రాలు, రూ.14.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావును వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో రూ.3,09,000 నగదు, 25 ప్రామిసరీ నోట్లు, పలు విలువైన ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు బృందాలు కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లపై దాడి చేశాయి. గుంటూరులో తొమ్మిది మంది ఇళ్లపై దాడులు చేసిన పోలీసులకు కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తి, అప్పుల పత్రాలు దొరికాయి. వైఎస్సార్ జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, పులి వెందుల, వేంపల్లె తదితర ప్రాంతాల్లో అధిక వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తిలో ముగ్గురు, అమలాపురం, రావులపాలెంలో కొంతమంది వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశాఖ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులను పోలీసులు విచారిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళను వేధించిన వడ్డీ వ్యాపారి గుడివాడ రామకృష్ణపై మంగళవారం కేసు నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు
Published Wed, Dec 16 2015 3:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement