నల్లమాడ : కర్నూలు జిల్లా నంద్యాలలో రైలు కిందపడి మరణించిన నల్లమాడ మండలం ఎర్రవంకపల్లికి చెందిన ప్రణీత్‌కుమార్(24) అనే విద్యార్థి మతదేహాన్ని స్వగ్రామానికి శనివారం తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన అన్నం లక్ష్మీనారాయణ కుమారుడైన ప్రణీత్ గతంలో ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తూ, ఇటీవలే గ్రూప్స్ కోచింగ్ నిమిత్తం నంద్యాలకు వెళ్లాడు. అక్కడ గురువారం పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి అక్కడికక్కడే మతి చెందాడు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. చెట్టంతా కుమారుడు అకాల మత్యువాతపడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదం అలుముకుంది. మతదేహాన్ని పలువురు నాయకులు, గ్రామస్తులు సందర్శించారు.
స్వగ్రామానికి విద్యార్థి మృతదేహం
Published Sat, Oct 15 2016 10:47 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement