విద్యార్థి ఆత్మహత్య
Published Thu, Aug 18 2016 12:06 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
హసన్‌పర్తి : డిగ్రీ పాస్ కానేమోనని ఆందోళనకు గురైన ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని 54వ డివిజన్ దేవన్నపేటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దేవన్నపేటకు చెందిన కందకట్ల రాకేష్ (22) నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదివాడు. అయితే ఫైనల్æఇయర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మళ్లీ పరీక్ష కోసం ఫీజు కట్టాడు. కాగా, త్వరలో రాసే పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయం పట్టుకుంది. ఈ క్రమంలో మంగళవారం కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా రాకేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
Advertisement
Advertisement