మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని విద్యార్థుల ధర్నా
Published Sun, Dec 4 2016 3:06 AM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
తిప్పర్తి
మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించడం లేదని శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు వంటలను సరిగా వండటం లేదని, సరిపడా వడ్డించడం లేదని తెలిపారు. భోజనం పెట్టమని అడిగితే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరుకులను కూడా మాయం చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వరమూర్తి, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, సర్పంచ్ జాకటి మోష పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి ఏజెన్సీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ అరుణశ్రీ,, ఈఓ పీఆర్‌డీ జగదీశ్‌రావు, తండు నర్సింహగౌడ్ పాల్గొన్నారు.
Advertisement