తల్లి ఉద్యోగం కోసం.. అన్నావదిన హతం | Talli udhyogam kosam.. anna vadina hatham | Sakshi
Sakshi News home page

తల్లి ఉద్యోగం కోసం.. అన్నావదిన హతం

Published Tue, Nov 17 2015 4:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Talli udhyogam kosam.. anna vadina hatham

ఇల్లెందు: తల్లి ఉద్యోగాన్ని ఆశించి.. తనకు అడ్డున్నాడనే నెపంతో అన్నావదినను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లెం దులో సోమవారం చోటుచేసుకుంది. ఇల్లెందుకు చెందిన జాగటి సమ్మయ్య(సామ్యేల్), కమలమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు విజయ్‌కుమార్, విల్సన్. సింగరేణి ఉద్యోగి సామ్యేల్ 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. అతడి ఉద్యోగం భార్యకు ఇచ్చారు. పెయింటింగ్ పనులు చేస్తున్న చిన్నకొడుకు విల్సన్ మద్యానికి బానిసయ్యాడు.

భార్యతో  గొడవపడి పుట్టింటికి పంపించేశాడు. ‘నీ ఉద్యోగం నాకే ఇవ్వాలి’ అంటూ తరచూ తల్లితో ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారంరాత్రి మద్యం మత్తులో ఇం టికి చేరుకున్న విల్సన్ మరునాడు వేకువజామున అన్న, వదినపై రోకలితో దాడి చేశాడు. వదిన సులోచన అక్కడికక్కడే మృతి చెందగా.. విజయ్‌కుమార్ ఇల్లెందు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement