రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం | tdp govt neglecting farmers | Sakshi
Sakshi News home page

రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం

Published Thu, Jun 15 2017 11:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం - Sakshi

రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం

► గిట్టుబాటు ధరలేదు.. శనగకు బీమా ఇవ్వలేదు
► మూడవ విడత రుణమాఫీ ఎప్పుడు?
► వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే రైతురాజ్యం
► రైతు ధర్నాలో డాక్టర్‌ సుధీర్‌రెడ్డి


ముద్దనూరు: దేశానికి అన్నం పెట్టే అన్నదాతను నిర్లక్ష్యం చేసి, రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని జమ్మలమడగు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డా.సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సిండికేట్‌ బ్యాంకు వద్ద రైతు సమస్యలపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ బేషరుతుగా రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబునాయుడు విడతలు విడతలుగా మాఫీ చేయడంతో రైతులు వడ్డీలు చెల్లించలేక అప్పులపాలయ్యారన్నారు. మూడవ విడత రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబు అమరావతిని తప్ప అన్నదాతలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

పంట రుణాల మంజూరులో స్కేల్‌ఆఫ్‌ఫైనాన్స్‌ విధానంతో ఒక్కోపంటకు ఒకో విధంగా రుణం మంజూరు చేస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రైతు రాజ్యం వస్తుందన్నారు. వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ తరుçఫున గెలిచిన జిల్లాకు చెందిన మంత్రికి చంద్రబాబును పొగడడం, వైఎస్‌ జగన్‌ను విమర్శించడం తప్ప రైతు సమస్యలను పట్టించుకున్న పాపానే పోలేదన్నారు. 2012–13 శనగ బీమాను ఇంతవరకూ రైతులకు చెల్లించకపోవడం దారుణమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వీరారెడ్డి వైఎస్సార్‌ సీపీ నాయకులు కాంతయ్య, శివశంకర్‌రెడ్డి, సుబ్బిరెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, జయరామకృష్ణారెడ్డి, శశిధర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, సుమంత్, సుధాకర్,ఖాదర్‌ఖాన్, వీరమ్మ, గంగయ్య, పరమేశ్వరరెడ్డి, శంకర్‌రెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement