విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సచివాలయ నిర్మాణానికి తొలి అడుగుపడనుంది. సచివాలయ నిర్మాణానికి వేసిన టెండర్లను బుధవారం అధికారులు తెరిచారు.
తొలి దశలో ఆరు భవనాల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించారు. టెక్నికల్ బిడ్లో ఎల్అండ్టీ, షాపూర్జీ అండ్ పల్లోంజి కంపెనీలు పాల్గొన్నాయి. దీని కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. నాలుగు నెలల్లో భవనాలు నిర్మిస్తే 2 శాతం, ఆరు నెలల్లో నిర్మిస్తే ఒక శాతం ప్రోత్సాహకం అందించనున్నారు. సకాలంలో కట్టకుంటే పదిశాతం కోత విధిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన అధికారులు ఆర్థిక బిడ్లు తెరవనున్నారు.