హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు దసరా సెలవుల్లోనూ పనిచేయనున్నారు. సచివాలయంలో ముఖ్య విభాగం ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8, 9, 10 తేదీల్లో ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ పరిపాలన శాఖ, హోం, ఫైనాన్స్, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులు హాజరు కావాలని సూచించింది.
పండుగ రోజుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు కాంపన్సేటరీ, క్యాజువల్ లీవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ రోజున కొత్త జిల్లాలు ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
తెలంగాణ ఉద్యోగులకు దసరా సెలవులు లేవు!
Published Thu, Oct 6 2016 8:26 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement