విభజన సమస్యల పరిష్కారానికి కొత్త సబ్ కమిటీ | telugu states Division issues new committee appointed by central govt | Sakshi
Sakshi News home page

విభజన సమస్యల పరిష్కారానికి కొత్త సబ్ కమిటీ

Published Mon, Nov 23 2015 4:31 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

telugu states Division issues new committee appointed by central govt

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా తలెత్తిన వివిధ సమస్యల పరిష్కారానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. తాజాగా కేంద్ర హొంశాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ నేతృత్వంలో ఓ సబ్ కమిటీని ఏర్పాటుచేసింది.

సబ్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లను నియమించింది. అనిల్ కుమార్ సింఘాల్, శశాంక్ గోయల్తో పాటు ఏపీ, తెలంగాణ ఆర్థికశాఖ కార్యదర్శులైన ప్రేమ్చంద్రారెడ్డి, రామకృష్ణారావు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం ఈ నెల 26న జరగనుంది. విభజన సమస్యలను 2 నెలల్లో కొలిక్కి తీసుకురావాలని కమిటీని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement